Feeds:
టపాలు
వ్యాఖ్యలు
పచ్చని పంట పొలాల గట్లు,
నీటి ఒడ్డున గడ్డి పూలు,
పసిడి పూల కాంతులు,
పిల్ల కాలువా లేక ఒయ్యారి గోదారా!!!
గమనిక:
పై ఫోటో నా మిత్రుడు అనిల్ నుంచి తీసుకున్నా.
పెదవి దాటని మాటకు ప్రభువు నువ్వు
పెదవి దాటిన మాటకు బానిసవు నువ్వు
ఈ వాఖ్యం ఎక్కడో చదివాను. ఎంతో మంచిగా అనిపించింది.
చాల రోజుల తరువాత మళ్ళీ ఇది గుర్తుకొచ్చింది మీతొ పంచుకుందామని ఇక్కడ పొస్ట్ చేస్తున్నా.
నాకు దీని నుంచి అర్థం అయినది ఏమిటంటే.
“నీవు మాట్లడబోయే మాటలకు నువ్వు ప్రభువు, తొందరపడి మాట్లడకుండా ఆలోచించుకొని మాట్లాడు.
ఒకసారి ఒక మాట మాట్లాడాక దానికి కట్టుబడి వుండు, అంతే కాకుండా తొందరపడి ఏదైన తప్పుగా మాట్లడితే అది ఇతరులను బాధించవచ్చు”.

ఇది వసంతమా?

మోడుబారిన చెట్లు చిగురించెను రంగురంగుల ఆకులతోటి,
ఆవిరియిన నీళ్ళు భువికిదిగెను నీలి మేఘాలదాటి,

ఆకులపై పడ్డ ఆ చినుకులు మెరిసెను రంగుల ముత్యాల్లా,
మనసుపై పడ్డ ఆ చిత్రాలు తలపించెను అందాల వసంతంలా !!!

నీ చూపులు

అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు,
పచ్చని పంట పొలాలను నును వెచ్చగా తాకినట్టు,

నీ చూపుల బాణాలు, నా హ్రుదయాన్ని స్రుశించాయి. .

నీ పరిచియం

తొలకరి జల్లులతో వచ్చే మట్టి వాసనలా,

వసంత మాసం తెచ్చే పూల పరిమళంలా,

నా గుండెకు కొత్త అనుభూతిని కలిగించింది నీ పరిచియం.
చాలా రోజుల నుంచి తెలుగులో బ్లాగ్ రాద్దామని ఒక శుభ ముహుర్తాన ఈ బ్లాగును నిర్మించాను. కాని సరి అయిన సమయం కుదరక ,కొంచెం పని ఒత్తిడి వల్ల టపా మొదలు పెట్టలేక పొయాను.
ఈ రోజు ఎందుకో ఆలోచన వచ్చింది, పని ఎప్పుడూ వుంటుంది మనం దీని కోసం సమయం కేటాయించలి అని ..రాస్తున్నా నా మొదటి టపా.
నా మొదటి టపా, నా బ్లాగు పేరు అభేద్యుడు పేరు ఎందుకు పెట్టానంటే,
నాకు మా తెలుగు మస్టారు శ్రీ సుబ్రమణ్యం గారు అంటే చాల ఇష్టం. ఆయన చాల చక్కగా తెలుగు చెప్పే వారు, ప్రతి పద్యాన్ని చక్కటి వివరణలతో, ఏదైన చిన్న కథలతో చెప్పే వారు. ఎప్పుడు ఏ ప్రశ్న వేసినా నేను టక్కున సమధానం చెప్పడానికి తయారయ్యేవాడిని,తిరిగి నేను ఏవో సందేహాలు అడిగేవాడిని. అంతే కాకుండా చురుకుగా వుండేవాడిని పాఠశాలలో.
ఒక రోజు మా అమ్మ తో వెళుతుంటే మాస్టారు గారు కలిసారు, అప్పుడు ఆయన అన్న మాటలు “మీ వాడు అభేద్యుడమ్మా” అని.
ఆభేద్యుడు అంటే చాల గట్టివాడు/చేధించబడడు  అని అర్థం వస్తుంది.
ఆ రోజుల్లో ఉపాధ్యాయులు ఎంతో బాధ్యతతో వుండేవాళ్ళు. ఎన్నో మంచి విషయాలు  చెప్పేవాళ్ళు. అప్పుడు (90’స||) చదువుకున్న నేను ఎంతో అద్రుష్టవంతున్ని.
గమనిక:
తెలుగు తప్పులుంటే మన్నిచండి.