పిచ్చ…
ప్రతి మనిషికి ఏదో ఒక పిచ్చ వుండాలి. ఈ డైలాగుని ఒక సినిమాలో విన్నా. నిజమే కదా అనుకున్నా.
నాకు వెంటనే నేను ఇంజినీరింగ్ లో చదివిన ఒక బుక్ గుర్తుకొచ్చింది.
“Who moved my cheese”
ఈ బుక్ లో కొంతమంది స్నేహితులు వాళ్ల చదువులు అయ్యాక , కొద్ది సంవత్సరాల తరువాత కలుసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో స్థితిలో వుంటారు. అప్పుడు కథ చెపుతారు అందులో ఒకరు. కథ సారాంశం నీకు కావాల్సింది ఎవరూ తీసుకోరు అది ఇక్కడే వుంటుంది వెతుక్కొని సంపాదించుకోవాలి అని నాకు అర్థం అయ్యింది.
ఏదో చదివాం అందరి లాగా ఇంజినీరింగ్. జాబ్ వచ్చింది చేస్తున్నాం. అసలు నేనేంటి నా పిచ్చ ఏంటి. అని ఆలోచిస్తూ వుంటాను అప్పుడప్పుడు. ఇప్పుడూ అదే గుర్తొచ్చి రాస్తున్నా.
మీరు నా లాగా ఎప్పుడైన ఆలోచించారా? మీ పిచ్చ ఏంటో మీకు తెలుసా? :-).
పిచ్చివాళ్ళు ఎక్కడైనా పిచ్చి ఉందని ఒప్పుకుంటారా చెప్పండి:)
who moved my cheese ento aa elakala gola ani madyalo aapesaa
పిచ్చపిచ్చగా నాకో పిచ్చి వుంది లెండి 🙂
పద్మార్పిత గారు,
అసలు పిచ్చ ఉందో లేదో వాళ్ళకి తెలుసో లేదో మరి :-).
శరత్ గారు,
మీరు ఆ పిచ్చని పిచ్చి పిచ్చిగా పిచ్చెకించండి :-D.
చందు గారు,
అది మంచి బుక్ అండి , కుదిరితే చదవండి.
ప్రతి మనిషికీ కనీసం పది రకాల పిచ్చి ఉంటుంది.ఫలానా పిచ్చిలో మనం లేతగా వున్నామో,ముదుర్లయ్యామో తెలుసుకోవాలంటే కాసేపు పిచ్చిగా ఆలోచించాల్సిందే
శ్రీకాంత్ గారు,
సంతోషం. నేను ఇంకా పిచ్చిగా ఆలోచిస్తా, నా పిచ్చ ఏమిటో తెలుసుకోవడానికి 🙂
nijame, pratimanishilonu aparichituluntaaru. kaanee bayativaallaki bhayapadi andaram natistuntam. kaanee ekkado oka daggara, eppudo okappudu bayatapadutuntam. evaripichchi vaallakaanandam annaranduke. ila charchaku pettinanduku thanks..
సామాన్యుడు గారు,
మీరన్నది కరక్టే, ప్రతి మనిషిలోనూ చాలా ప్రవర్తనలు వుంటాయి.
కాని నా పోస్ట్ ఉద్యేశం, మనకు నచ్చినది ఏంటి, ఏదంటే మనకు ఎక్కువ పిచ్చ అని.
స్పందించినందుకు సంతోషం.
చాలారోజులుగా పిచ్చ పిచ్చ గా ఆలోచిస్తున్నాను నా పిచ్చి ఏమిటో తెలుసుకోవడానికి. నాకు 3-4 రకల పిచ్చిలున్నాయి. వాటిలో ఏ పిచ్చి అయితే పిచ్చ పిచ్చగా బావుంటుందో అర్థకావట్లేదు….పిచ్చెక్కిపోతోంది ఆలోచించి చించి 😛
b/w “who moved my cheese” is an excellent book, read it recently !
సౌమ్య గారు,
థాంక్స్ అండి. నేను ఇంకా నా పిచ్చ ఏంటో తెలుసుకొనే పనిలో ఉన్నా 🙂
మూడ్‌ని బట్టి నాలో అయిదారు రకాల పిచ్చి ఉందని తెలుసుకున్నా…కాని అందులో గట్టిగా పిచ్చెక్కించే పిచ్చెదో తెలుసుకోలేకపోతున్నా….
నాగార్జున గారు,
నా పరిస్తితి కూడా అలాగే వుందండి. 🙂
నేనూ నాకు ఏ పిచ్చి ఎక్కువో పిచ్చ పిచ్చగా ఆలోచిస్తాను. 😉
అవునా మధురవాణి గారు 🙂
ఆ పిచ్చి అంటే
x పిచ్చి y పిచ్చి ఏదేదో పిచ్చి
ట్యూన్ చేసి పాడానంటే ఎక్కునులే పిచ్చి
ఎవరి పిచ్చి వాళ్లకానందం
మార్తాండ కి వదినంటే పిచ్చి
మాకు బ్లాగులంటే పిచ్చి
స్వప్న కి సల్సా అంటే పిచ్చి
బాగుంది అన్నయ్యా..పిచ్చి గోల