ఇండియా వచ్చి చాలా రోజులయ్యింది. ఎప్పటికప్పుడు బ్లాగ్ వైపు ఒక కన్నేద్దామంటే కుదరలేదు.
ఆ మద్య నాకొక ఐడియా వచ్చింది. మనం ఏదయినా జాబ్ కి అప్లై చేయాలంటే మన దరకాస్తులో ఎలా మన స్కూలు , కాలేజి మరియు ఉత్తీర్ణత పొందుపరుస్తామో , అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఎలెక్షన్ కి ముందు వారి వారి బయోడెటాని ప్రజలకు తెలియచేస్తే బాగుంటుందని అనిపించింది.
అయినా నా పిచ్చి గాని ఇలాంటి రూల్ అసలు వస్తుందంటారా?
మన రాజ్యాంగం ప్రకారం ప్రజా ప్రతినిధులకు చదువు అవసరం లేదు. కాని కనీసం పేపర్ కూడా చదవడం రాని వ్యక్తికి ఓటు వేయాలంటే నాలాంటి వాళ్ళకు మనసు రాదు.
యంగ్ జెనరేషన్ ఓటింగ్ శాతం పెరగాలంటే ఇలాంటి ఐడియాలు అమలు పరచాల్సిందేనని నా అభిప్రాయం. ఏమంటారు? 🙂
During the elections every candidate is supposed to give affidavit. This affidavit will contain their educational details.
http://eci.nic.in/eci_main/CurrentElections/ge2009/Affidavits_fs.htm
Yes.
They are available.
I want these info reachable to the Public people before elections :-).
a pamphlet should be released(just like our resume) to the people.