Feeds:
టపాలు
వ్యాఖ్యలు

మంచో / చెడో

నేను మా ఊరిలో వున్నాను. నిన్న ఒక పని చేశాను. కాని అది మంచో చెడో అర్థం కాలేదు.

 నాకు ఒక షాప్ దగ్గర అయిదు వందలు దొరికాయి. అవి ఆ షాప్ వాడివి కావని అర్థం అయ్యింది. వాడిని అడిగితే ఖచ్చితంగా అతనివే అని తీసుకుంటాడు. అందుకని ఆ 500 ఎవరికయిన ఇద్దాం అని నేను మా అన్న అనుకున్నాం. డబ్బులు ఇస్తే అవి వాడుకోరు అని అనిపించి అన్నకు చెప్పాను.

 అన్న ప్రతి శనివారం గుడికి వెళతాడు. అక్కడ ముసలి వాళ్ళు చలిలో వుంటారు అన్నాడు. వెంకటేశ్వరస్వామి గుడి దగ్గరకు వెళ్ళి చూశాము. అక్కడ ఒక ముసలావిడ వున్నింది. సరే అనుకొని ఒక బట్టల షాపుకు వెళ్ళి రెండు దుప్పట్లు కొని 400 రూపాయలకు గుడికి వెళ్ళాము.

 “అవ్వా ఇందులో రెండు దుప్పట్లు వున్నాయి. ఒకటి నువ్వు తీసుకొని ఇంకొకటి నీ పక్కనుండే అవ్వకు ఇవ్వు అని చెప్పి, మిగిలని 100 రూపాయల్తో తినమని చెప్పి వచ్చాము”.

కాని లోపల ఏ మూలో బాధగా అనిపించింది. ఆ 500 ఎవరియిన పేదవాడివి ఏమో అని. ఆ పోగొట్టుకున్నవాడికి మంచి జరగాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా.

ఇండియా వచ్చి చాలా రోజులయ్యింది. ఎప్పటికప్పుడు బ్లాగ్ వైపు ఒక కన్నేద్దామంటే కుదరలేదు.

ఆ మద్య నాకొక ఐడియా వచ్చింది. మనం ఏదయినా జాబ్ కి అప్లై చేయాలంటే మన దరకాస్తులో ఎలా మన స్కూలు , కాలేజి మరియు ఉత్తీర్ణత పొందుపరుస్తామో , అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఎలెక్షన్ కి ముందు వారి వారి బయోడెటాని ప్రజలకు తెలియచేస్తే బాగుంటుందని అనిపించింది.

అయినా నా పిచ్చి గాని ఇలాంటి రూల్ అసలు వస్తుందంటారా?

మన రాజ్యాంగం ప్రకారం ప్రజా ప్రతినిధులకు చదువు అవసరం లేదు. కాని కనీసం పేపర్ కూడా చదవడం రాని వ్యక్తికి ఓటు వేయాలంటే నాలాంటి వాళ్ళకు మనసు రాదు.
యంగ్ జెనరేషన్ ఓటింగ్ శాతం పెరగాలంటే ఇలాంటి ఐడియాలు అమలు పరచాల్సిందేనని నా అభిప్రాయం. ఏమంటారు? 🙂
గత సంవత్సరంగా సియోల్ లో పని చేస్తున్నా. ఈ రోజు చివరి రోజు ఇక్కడ. రేపు ఇండియా వెళుతున్నా.
ఈ సంవత్సరంలో చాలా మంది కొత్త వాళ్ళతో పని చేశాను. ఇక్కడ పీపుల్ చాలా మంచి వాళ్ళు.
నాకు గుర్తున్న విషయాలు, నేను ఎంజాయ్ చేసినవి

1. Hang River Park near Dangsan

2. Club Friday

3. Cooking

4. Wednesday Breaks 😉

5. Suwon visit to friends place

6. Avatar movie at Yongsan CGV

7. River side walks

8. Playing TT, going for swimming, badminton (though quite few times)

9. Thakalbee

10.Finally today met my Old friend VK, this is sudden and it is so good meet him.

అప్పుడప్పుడు కొద్దిగా వర్క్ టెన్షన్ , కాని చాలా బాగా ఎంజాయ్ చేశాను.
Bye SeOUL…
Bangalore – నేను వస్తున్నా!!!
ఈమధ్య ఇలాంటి వార్తలు సాదరణమై పోయాయి. ఎన్నో ఆశలతో అమెరికాకెల్లిన విద్యా కుసుమాలు నేల రాలుతున్నాయి.
కేవలం డబ్బుల కోసం బ్లాక్స్ మనుషులను చంపేస్తున్నారు. పార్ట్ టైం పని చేసేవాళ్ళు అందునా ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా చనిపోతున్నారు. ఇది ఎందుకో నేను కారణాలు అన్వేషించటం లేదుకాని అమెరికాలో వున్న భారతీయులు జాగ్రత్తగా వుండాలని కోరుకుంటున్నా.
ఉన్నత విద్య కొరకో లేక డబ్బు సంపాదనకొరకో వెళ్ళిన వాళ్ళు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించుకొని పార్ట్ టైం జాబ్స్ చేయవలసిందిగా మనవి. ఏ చిన్న పొరపాట్లకు తావివ్వకుండా మీ కెరీర్ని మలుచుకోండి. కన్నవారికి మరియు బందువులకు కడుపు కోత మిగల్చవద్దు.
ఇలాంటి సంఘటనలు మరళా జరగకూడదని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.
PS:
Regarding the news about Mr.Arun Kumar Narote who was shot dead last night. May his soul rest in peace.

నా ఆశ…

నేను చూసాను ఆమెను నా స్వప్నంలో

ఊసులాడాను ఆమెతో నా ఊహల్లో…

ఆమె మాటల మాధుర్యానికి నా మనసు మేఘమై

చిరు చినుకులుగా రాలితే

ఆ చినుకుల సవ్వడి

నా హృదయ స్పందనను,

ఆ చినుకుల స్వఛ్చత

నా స్వఛ్చమైన ప్రేమను,

ఆమెకు తెలిపాలని నా ఆశ.

చిలిపిగా చూసే నీ కళ్ళు
కొంటె ఆశలను నా మనసులో రేపాయి.

అలలుగా ఎగసే నీ కురులు
బొండు మల్లెల పరిమళాన్ని నా దరికి చేర్చాయి

గలగలా మాట్లాడే నీ పెదాలు
మంచి సంగీతాన్ని నా చెవులకు వినిపించాయి

మువ్వలను మరిపించే నీ పాదాలు
లయ బద్దంగా అడుగేస్తున్న… ఈ క్షణం
నా మది గదిలో పదిలం, కల కాలం…
ఒక సహ బ్లాగరు రాసిన “హృదయం – మనస్సు” టపాకి నా అభిప్రాయం.
“హృదయం – మనస్సు” కు గల సంబంధం.
హృదయాన్ని నా దృష్టిలో గుండెకు పర్యాయపదం. మనసు మన ఆలోచనలకు సంబంధిచినది.
మనసును మంచి చెడులతో పోల్చవచ్చు. మనసు మంచిదైతే వాడికి గుండె ఉందిరా అని మనం అనుకోవడం చూస్తుంటాము.
హృదయం భౌతికమే అయినా వాడుకలో అది మనషుల మంచితనానికి ప్రతీక.
“హృదయంతో మాట్లాడమంటే  నీ మనసు చేసే ఆలోచనలను మానవత్వంతో చూడమని”
పిచ్చ…
ప్రతి మనిషికి ఏదో ఒక పిచ్చ వుండాలి. ఈ డైలాగుని ఒక సినిమాలో విన్నా. నిజమే కదా అనుకున్నా.
నాకు వెంటనే నేను ఇంజినీరింగ్ లో చదివిన ఒక బుక్ గుర్తుకొచ్చింది.

“Who moved my cheese”

ఈ బుక్ లో కొంతమంది స్నేహితులు వాళ్ల చదువులు అయ్యాక , కొద్ది సంవత్సరాల తరువాత కలుసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో స్థితిలో వుంటారు. అప్పుడు కథ చెపుతారు అందులో ఒకరు. కథ సారాంశం నీకు కావాల్సింది ఎవరూ తీసుకోరు అది ఇక్కడే వుంటుంది వెతుక్కొని సంపాదించుకోవాలి అని నాకు అర్థం అయ్యింది.

ఏదో చదివాం అందరి లాగా ఇంజినీరింగ్. జాబ్ వచ్చింది చేస్తున్నాం. అసలు నేనేంటి నా పిచ్చ ఏంటి. అని ఆలోచిస్తూ వుంటాను అప్పుడప్పుడు. ఇప్పుడూ అదే గుర్తొచ్చి రాస్తున్నా.

మీరు నా లాగా ఎప్పుడైన ఆలోచించారా?  మీ పిచ్చ ఏంటో మీకు తెలుసా? :-).

ధనమూలమిదంజగత్ (తప్పువుంటె సరి చేయండి). ఈ ప్రపంచంలో అన్నిటికీ కారణం ధనం అని చదువుకున్నాను. దాన్నే నా మాటల్లో.
పుట్టుకకు అదే,
కట్టుకదే బొట్టుకదే,
మెట్టుటకూ అదే!
జన్మకు అదే,
జేబుకదే జాబుకదే,
జబ్బుకూ అదే!!
కూటికదే… కాటికీ అదే,
అది లేనిదే కదలదేదీ!!!
తప్పులెన్నువారు తండోపతండంబు,
లుర్వి జనులకెల్ల నుండుతప్పు,
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు,
విశ్వదాభి రామ వినరా వేమ!
ఈ ప్రపంచంలో ఇతరుల తప్పులు చెప్పేవారు ఎంతో మంది. తప్పులు అందరిలో ఉంటాయి.ఇతరుల తప్పులు ఎంచే వారు తమ తప్పులు తెలుసు కోరు అని అర్థం.
ఈ పద్యం అందరికి తెలిసే ఉంటుంది కానీ ఎవ్వరు ప్రక్క వారి గురుంచి మాట్లడేముందు ఆలోచించరు.కనీసం తమ స్థాయి ఏంటో తెలుసుకోకుండా ఇతరుల తప్పులను వేలెత్తి చూపించే వారిని చూసి జాలి పడుతున్నా.